ETV Bharat / state

'దేశాన్ని అస్థిర పరిచేందుకే దిల్లీ అల్లర్లు' - Bjp Intellectual Meeting CAA

భాజపా రాజకీయ ప్రత్యర్థులు పౌరసత్వ బిల్లుపై ముస్లింలను రెచ్చగొడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. భాజపా కార్యాలయంలో పార్టీ అనుపాల్గొని మాట్లాడారు.

Bjp Intellectual Meeting
Bjp Intellectual Meeting
author img

By

Published : Mar 1, 2020, 5:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా మోదీకి పెరుగుతున్న ఆదరణ చూడలేక సీఏఏపై మతం రంగు పులుముతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. భాజపా కార్యాలయంలో భాజపా ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో మేధావులతో సీఏఏ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని అస్థిర పరిచేందుకు కొందరు దిల్లీలో మారణకాండ సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ఎంఐఎం, తెరాస లు మతోన్మాద రాజకీయం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. శరణార్థులకు పౌరసత్వ ఇస్తామంటే... ఆందోళన చేయడం సరికాదని హితవు పలికారు. ప్రపంచంలోని 52 ముస్లిం దేశాల్లో లేని స్వేచ్ఛ భారతదేశంలోని ముస్లింలకు ఉందని చెప్పారు. సీఏఏకు అనుకూలంగా భాజపా ఈనెల 15న నిర్వహించనున్న సభకు అందరు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

'భాజపా ప్రత్యర్థులే సీఏఏపై ముస్లింలను రెచ్చగొడుతున్నారు'

ఇదీ చూడండి : నర్సాపూర్​లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.