ETV Bharat / state

Political Heat in Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఊపందుకున్న ఎన్నికల జోరు.. పోటాపోటీగా ప్రచారం - సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం

Political Heat in Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ప్రజాక్షేత్రంలో దిగిన ముఖ్య నేతలు, అభ్యర్థులు.. విస్తృతంగా పల్లె, పట్నం అనే తేడా లేకుండా తిరుగుతున్నారు. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే చేసే పనులను ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గులాబీ నేతలు మేనిఫెస్టోను వివరిస్తుండగా.. కాంగ్రెస్‌ నాయకులు ఆరు గ్యారంటీలను గడపగడపకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

Political Heat in Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 9:08 PM IST

Political Heat in Telangana Assembly Elections 2023 రాష్ట్రంలో ఊపందుకున్న ఎన్నికల జోరు.. గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం

Political Heat in Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల వేడి జోరందుకుంటోంది. అన్ని పార్టీల కంటే ముందే ప్రచారం ప్రారంభించిన గులాబీ పార్టీ అభ్యర్థులు.. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ సనత్ నగర్‌ పరిధి బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)లో ఎవరు ముఖ్యమంత్రి అనేది వాళ్లకి స్పష్టత లేదని.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రజలకు తిప్పలు తప్పవని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మల్లారెడ్డి(Malla Reddy) పాల్గొన్నారు.

Election Heat in Telangana 2023 : రైతుబంధును ఆపేయ్యమని కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని మంత్రి జగదీశ్​రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం(BRS Election Campaign) ప్రారంభించి ఇంటింటికి కేసీఆర్ భరోసా పథకాలను వివరించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బీఆర్ఎస్ ద్విచక్రవాహన ర్యాలీలో మంత్రి మహేందర్​ రెడ్డి పాల్గొన్నారు. చేవెళ్లలో కాలే యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. 13 ఏళ్లుగా జాడ లేని మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడిని ఎమ్మెల్యే చేయాలని.. మళ్లీ మెదక్‌ వస్తున్నారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్‌లో పద్మా దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

BRS Campaign in Telangana Assembly Elections : అభివృద్ధి నినాదం.. విపక్షంపై విమర్శల వాదం.. ప్రచారంలో కారు జోరు

Congress Leader on 6 Guarantees : ఖమ్మం వైఎస్సార్ కాలనీ నుంచి మాజీ మంత్రి తుమ్మల ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీలో ర్యాలీగా వెళ్తూ ప్రజలకు ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై కేసులు పెడితే తర్వాత జరిగే పరిణామాలకు పోలీసు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తుమ్మల హెచ్చరించారు.

BRS Election Campaign in Suryapet : సంగారెడ్డి జిల్లా రుద్రారం గణపతి ఆలయంలో బీఆర్ఎస్ ప్రచార వాహనాలకి ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గులాబీ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో పలువురు గులాబీ పార్టీలో చేరారు. రైతులకు అన్యాయం చేసేలా కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారని నారాయణ పేట జిల్లా మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌ రెడ్డి విమర్శించారు.

BRS Election Plan In Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గులాబీ దళపతి కేసీఆర్ నజర్.. పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం

Congress Ticket War in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు దక్కించుకునేదెవరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.