Birth Day Wishes to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. సీఎంకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. కేసీఆర్ చిరకాలం ఆరోగ్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
దిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు, అసోం ముఖ్యమంత్రులు స్టాలిన్, హిమంత బిశ్వశర్మ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని ప్రార్థించారు. సినీనటులు చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కేసీఆర్‌కు విషెస్ తెలిపారు. నిండు నూరేళ్లు కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
CM KCR Birth Day Celebrations: కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ సంతోశ్‌కుమార్, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే సందర్భంగా కీసరగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ సంతోశ్‌కుమార్ కీసర అర్బన్ ఎకో పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం..: సిద్దిపేటలో ఘనంగా నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం సిద్దిపేటలో రక్తదాన శిబిరం చేపట్టారు. ఈ సందర్భంగా కారణజన్ముడైన కేసీఆర్ తెలంగాణ బిడ్డ కావడం మనకు గర్వకారణమని.. రాష్ట్ర ప్రజలు ఆత్మ గౌరవంతో బతికేలా కేసీఆర్ కృషి చేశారని హరీశ్‌రావు కొనియాడారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభం అన్న ఆయన.. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. వీరితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చూడండి..