హైదరాబాద్లో లాక్డౌన్ మినహాయింపు సమయం ముగిసినా రోడ్లపైకి వస్తున్న వాహనాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దిల్సుఖ్నగర్, మలక్ పేట, సరూర్ నగర్, చైతన్యపురిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్-కోఠి ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేసి ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకుని... కేసులు నమోదు చేస్తున్నారు.
మెడికల్ ఎమర్జెన్సీ, అనుమతులు ఉన్న ఇతర వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అందరూ విధిగా మాస్కును ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఒంటరితనమా..? ఇలా ఓడించేద్దాం..