పోలీస్ ఉద్యోగం క్రమశిక్షణతో కూడుకున్నదని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. పరేడ్ గ్రౌండ్లో రెండో వార్షిక క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు.
వృత్తి రీత్యా ఒత్తిడికి గురైన పోలీసుల మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గతేడాది మాదిరిగానే ఈసారీ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అధికారులతో కలిసి సీపీ సజ్జనార్ వాలీబాల్ ఆడారు.
నాలుగు రోజులపాటు జరగనున్న పోటీల్లో సైబరాబాద్ పరిధిలోని అన్నిజోన్ల పోలీస్ సిబ్బంది పాల్గోనున్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీసీ వెంకటేశ్వరరావు, డీసీపీ అనసూయ, పలువురు ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
ఇవీచూడండి: అరబ్షేక్ల లీలలు.. పాతబస్తీ యువతులతో రహస్య పెళ్లిల్లు