Police Special Surveillance On Ganja: ఒకప్పడు ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు యదేచ్ఛగా గంజాయి రవాణా జరిగేది. టన్నుల కొద్దీ సరకును హైదరాబాద్ మీదుగా వాహనాల్లో అక్రమార్కులు తీసుకెళ్లేవారు. అయితే గంజాయి మీద ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
పోలీసుల నీఘా పెరగడంతో.. గంజాయి సరఫరాకు డిమాండ్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌ర్స్‌మెంట్ వింగ్‌ని ఏర్పాటు చేసి మత్తుదందాల పనిపడుతుండగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో ఎస్ఓటీ, శాంతిభద్రతల పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు. తద్వారా హైదరాబాద్ వైపు వచ్చిన ఏ గంజాయి వాహనమైనా పోలీసులకు చిక్కుతోంది. నిఘా పెరగడంతో.. గంజాయి సరఫరాకి డిమాండ్ పెరిగింది. విశాఖ ఏజెన్సీ నుంచి మహరాష్ట్రకు తరలిస్తే.. లక్షల్లో డబ్బులు మట్టజెబుతున్నారు.
గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ఆదేశాలు: ఒకప్పుడు కిలో మూడు వేలలోపు ఉండే గంజాయి.. రాష్ట్ర పోలీసుల దెబ్బకు మహరాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో కిలో 15 వేలకు పైగా పలుకుతోంది. గంజా నుంచి తీస్ హాష్‌ఆయిల్ నగరంతో పాటు మహరాష్ట్రలో కూడా భారీగా డిమాండ్ ఉండటంతో నేరగాళ్లు కొత్తఎత్తుగడలు వేస్తున్నారు. కొందరు లారీల్లో బియ్యం బస్తాల మాటున గంజాయిపెట్టి రవాణా చేస్తుండగా మరికొందరు లారీల క్యాబిన్లు, డీజిల్ ట్యాంకర్ ప్రక్కన, ట్రక్కు అడుగు భాగంలో 1000 నుంచి 500 కిలోల వరకూ పట్టేలా ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిలో సరుకుపెట్టి అనుమానం రాకుండా తరలిస్తున్నారు.
గంజాయి సరఫరా.. పోలీసులు ప్రత్యేక బృందంతో నిఘా: పాతనేరస్థుల వద్ద సేకరించిన సమాచారంతో సరఫరాదార్ల ఫోన్ నంబర్లు తీసుకొని పోలీసులు.. ట్రాక్ చేస్తున్నారని తెలసుకున్న నిందితులు అసలు ఫోన్ ఆఫ్ చేస్తున్నారు. మరికొందరు అసలు ఫోన్ వాడట్లేదు. డెలివరీ చేయాల్సిన వారిఫోన్ నంబర్ మాత్రం తీసుకొని దాబాల వద్ద ఆగినపుడు ఇతరుల ఫోన్ నంబరుతో వారితో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టోల్‌గేట్లు దాటకుండా గ్రామాల మీదుగా గమ్యస్థానానికి చేరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1104 గంజాయి సరఫరా కేసులు: ఇటీవల పోలీసులు పట్టుకున్న పలు ముఠాలు ఆ తరహాలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 1104 గంజాయి సరఫరా కేసులు కాగా.. 31 వేల 301 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. 2 వేల 582 మందిని అరెస్ట్ చేశారు. పలువురిపై పీటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 350 కేసులు నమోదు కాగా.. సుమారు 400 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: