ETV Bharat / state

భాగ్యనగరంలో 450 కిలోల గంజాయి పట్టివేత - హైదరాబాద్​ తాజా వార్తలు

విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వేర్వేరు కేసుల్లో నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 450కిలోల గంజాయిని రెండు కార్లు, 4 చరవాణులు, లక్షా 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 55లక్షలు ఉంటుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

Police seized 450 kg of cannabis
భాగ్యనగరంలో భారీగా గంజాయి పట్టివేత
author img

By

Published : Mar 3, 2020, 7:02 PM IST

Updated : Mar 3, 2020, 7:32 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని వేరువేరు ఘటనల్లో హైదరాబాద్​ ఎల్బీనగర్​ పోలీసులు పట్టుకున్నారు. ఓ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 300 కిలోల గంజాయి 1.50లక్షల నగదు, కారు మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరో కేసులో వెంకన్న అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్ పూర్తిచేసి గేట్‌లో ఉత్తీర్ణుడై ఎన్ఐ​టీలో చేరిన తరువాత చెడువ్యసనాలకు బానిసై డబ్బుకోసం గంజాయి సరఫరా చేస్తున్నట్లు సీపీ వివరించారు. నిందితుడు గంజాయిని మహారాష్ట్రకు తీసుకువెళుతుండగా అరెస్టు చేసి అతని నుంచి 150కిలోల గంజాయి ఒక కారు చరవాణి స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు..

భాగ్యనగరంలో భారీగా గంజాయి పట్టివేత

ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!

Last Updated : Mar 3, 2020, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.