వరద బాధితుల గొడవలను అరికట్టందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. వరద పరిహారం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు బాధితులు.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా మీ సేవ సెంటర్లకు తరలివచ్చారు. అబిడ్స్, చిరగల్లీ లైన్ లోని వివిధ బస్తీలలో రూ. 10 వేల వరద సహాయం అందని నిరుపేదలు మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడ్డారు.
బాధితులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వల్ల పోలీసులు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అబిడ్స్ పోలీసులు దగ్గరుండి ఒక్కొక్కరికి టోకెన్లను ఇచ్చారు. రోజుకు వంద టోకెన్లను ఇచ్చి మిగితా వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
ఇదీ చదవండి: వరద బాధితులతో కిక్కిరిసిన మీ సేవ కేంద్రాలు