ETV Bharat / state

గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం - గణేశ్​ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గణేశ్​ నిమజ్జన కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. 11 రోజులు ప్రత్యేక పూజలందుకున్న గణనాథులు... భారీ శోభాయాత్ర మధ్య హుస్సేన్​సాగర్​కు చేరుకోనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా చూస్తున్నారు. శోభాయాత్రను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్​ పోలీసులు... వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల పర్యవేక్షణకై 21 వేల మందితో నగర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గణేశ్​ నిమజ్జనం బందోబస్తు
author img

By

Published : Sep 11, 2019, 8:57 PM IST

Updated : Sep 11, 2019, 9:40 PM IST

గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం

వినాయక ఉత్సవాల్లో శోభాయాత్ర, నిమజ్జనం ఎంతో కీలక ఘట్టాలు. గురువారం ఉదయం విగ్రహాల శోభాయాత్ర ప్రారంభం కానుంది. 11 రోజులు పూజలందుకున్న పార్వతీ తనయుడు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి... బొజ్జ గణపయ్యను వాటిలో కొలువు దీర్చి ఊరేగింపు నిర్వహించనున్నారు. శోభాయాత్రను సజావుగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు 17 మార్గాల్లో హుస్సేన్ సాగర్​కు చేరుకోనున్నాయి.

ఆ మార్గాలే ప్రధానం...

శోభాయాత్రలో బాలాపూర్ నుంచి పాతబస్తీ, చార్మినార్, ఎంజే మార్కెట్, బషీర్ బాగ్ మీదుగా హుస్సేన్ సాగర్​కు వచ్చే మార్గమే ప్రధానమైంది. 19 కిలోమీటర్ల మేర సాగే ఈ శోభాయాత్రలో పాతబస్తీకి చెందిన వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్​కు చేరుకుంటాయి. ఉప్పల్, రామాంతపూర్, శివమ్ రోడ్, బర్కత్ పుర చౌరస్తా, నారాయణగూడ చౌరస్తా, మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకొని అక్కడి నుంచి ట్యాంక్​ బండ్ మీదకు వస్తాయి. దిల్​సుఖ్ నగర్, ఐఎస్ సదన్, సైదాబాద్ నుంచి వచ్చే వాహనాలు మలక్ పేట్, చాదర్ ఘాట్ మీదుగా ఎంజే మార్కెట్​కు చేరుకుంటాయి. టోలీచౌక్​, మెహదీపట్నం, రేతిబౌలి నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్, టెలిఫోన్ భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్​కు చేరుకుంటుంది. ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట మీదుగా వచ్చే శోభాయాత్ర నిరంకారి భవన్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్​కు వస్తుంది. టప్పాచబుత్ర, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే వినాయక విగ్రహాలు సీతారాంబాగ్, బోయగూడ కమాన్, గోషామహల్ బరాదారి, అలస్కా మీదుగా ఎంజే మార్కెట్ వద్దకు చేరుకుంటాయి.

ప్రాంతాల వారీగా బాధ్యతలు

శోభాయాత్రను పర్యవేక్షించేందుకు ప్రాంతాలవారీగా పోలీసు ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. నగరంలో ఉన్న 3 లక్షల సీసీ కెమెరాలను బషీర్​బాగ్​లోని కమాండ్ కంట్రోల్ రూమ్​కు అనుసంధానించారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల విగ్రహాలు సాగర్​లో నిమజ్జనమయ్యాయి. మరో 30వేల విగ్రహాలు రేపు ఒక్క రోజునే నిమజ్జనం కానున్నాయి.

విధుల్లో 21 వేల మంది...

వినాయక శోభాయాత్ర, నిమజ్జనం కోసం పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 21 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. కేంద్ర, రైల్వే పోలీసులు కూడా వీరికి సహకరించనున్నారు. కమాండ్​ కంట్రోల్​ రూం ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని కేటాయించారు. వజ్ర వాహనాలు, సీసీ కెమెరాలతో రూపొందించిన ప్రత్యేక వాహనాలను కేటాయించారు.

మధ్యాహ్నంలోపే ఖైరతాబాద్​ విగ్రహ నిమజ్జనం

భారీ వినాయక విగ్రహమైన ఖైరతాబాద్ గణేశుడిని మధ్యాహ్నం లోపే నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు పూజలు పూర్తి చేసి శోభాయాత్రను నిర్వహించి 10 గంటలకు ఎన్టీఆర్ మార్గ్​కు తీసుకురానున్నారు. 2.5 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రను 53 సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. భారీ క్రేన్ల సాయంతో మధ్యాహ్నం ఒంటిగంట లోపు నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదేకాకుండా నగరంలో 20 ప్రధాన విగ్రహాలపై దృష్టి సారించారు. వాటిని ప్రత్యేక యాప్​తో అనుసంధానించి ప్రతి నిమిషం 20 విగ్రహాల శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు.

పార్కింగ్​ స్థలాలు ఇవే...

వినాయక నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలు తమ వాహనాలను నిర్ధేశించిన ప్రాంతాల్లోనే నిలపాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీలోని జిల్లాపరిషత్ కార్యాలయం, బుద్ధ భవన్ వెనుక ఉన్న ప్రాంతం, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్​కు ఏర్పాట్లు చేశారు. ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం వల్ల వాహనాల రద్దీని తగ్గించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా వాహనాలు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రకటించి... ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే విధంగా ప్రజలకు సూచించనున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వాళ్లు బాహ్యవలయ రహదారి మీదుగా తమ ప్రయాణాన్ని ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనాలను క్రమబద్దీకరించేందుకు 2 వేల మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నట్లు సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. 13వ తేదీ మధ్యాహ్నం వరకు హుస్సేన్ సాగర్​లో విగ్రహాల నిమజ్జనం కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విగ్రహాలన్నింటినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్​లో ఉంచి... వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి : రవాణాశాఖ నిర్ణయించిన ధరకే నిమజ్జన వాహనాలు...!

sample description
Last Updated : Sep 11, 2019, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.