ETV Bharat / state

సోషల్ మీడియాలో జాగ్రత్త, అపరిచితులతో జాగ్రత్త అంటున్న పోలీసులు - Police say that social media needs to be careful

Police Said to Be Careful on Social Media : ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల వాడకం పెరిగింది. అపరిచితులతో స్నేహం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా.. ఆ తర్వాత అంతులేని విషాదాన్ని నింపుతోంది. ఎదుటివారి గురించి పూర్తిగా తెలియకుండా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం అనర్ధాలకు దారి తీస్తుంది. అపరిచితుల స్నేహం, ప్రేమ ముసుగులో ఎందరో మహిళలు, యువతులు మోసపోతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. సోషల్ మీడియా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Police said to be careful on social media

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 10:08 AM IST

Police Said to Be Careful on Social Media సోషల్ మీడియాలో యువత అప్రమత్తంగా ఉండాలి

Police Said to Be Careful on Social Media : ఆన్‌లైన్‌ వినియోగం క్రమంగా పెరుగుతోంది. సెల్‌ఫోన్‌ నిత్యావసరం అయిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌లు చేతిలోకి వచ్చిన తర్వాత దూరం తగ్గిపోయింది. ఎక్కడో ఉన్న వ్యక్తితో సమాచారం క్షణాల్లో చేరవేస్తున్నాం. దీనికోసం సామాజిక మాధ్యమాలైన (Social Media) ఫేస్‌బుక్‌, ఎక్స్‌(ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, టెలిగ్రాంలను వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో మోసగాళ్లు అమాయకులైన యువతులకు ఫేస్‌బుక్‌లో వల వేస్తున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి స్నేహం పేరుతో దగ్గరవుతున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. ఫొటోలు, వీడియోలను సేకరించి వాటిని మార్పింగ్ చేసి డబ్బులు వసూలు చేయడం, లైంగిక కోరిక తీర్చుకోవడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారు.

Pub G గేమ్​లో పరిచయం.. ఆల్కహాల్​ తాగించి రేప్.. ఆపై న్యూడ్​ వీడియోలతో బ్లాక్ మెయిల్

ఇటీవలే హైదరాబాద్‌లో ఉండే ఓ మైనర్ బాలికకు ఆర్నెళ్ల క్రితం.. ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే బాలిక రిక్వెస్ట్‌ను అంగీకరించగా గుర్తు తెలియని యువకుడు తరచూ చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఒకరి ఫోన్‌నెంబర్లు, ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సాప్‌లో వీడియోకాల్స్‌ చేసుకున్నారు. మూడు నెలల తర్వాత ఆ అమ్మాయి వాట్సాప్‌కు యువకుడు వీడియోలు పంపించాడు. అవి చూసిన అమ్మాయి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.

వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్‌ రికార్డ్‌ చేసి వాటినే సాంకేతికతతో మార్ఫింగ్ చేసినట్లు బాలిక గుర్తించింది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక.. తనలోనే కుమిలిపోయింది. యువకుడు క్రమంగా బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు. లైంగిక వాంఛ తీర్చకపోతే నగ్న దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించాడు. భయపడిన యువతి నిందితుడు చెప్పినట్లు చేసింది. వేధింపులు తీవ్రం కావడంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Social Media Love Stories : మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ కాదు.. మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ సోషల్ మీడియా

Police Precautions on Using Social Media : పోలీసుల నిందితుడిని అరెస్ట్ చేశారు. వారం వ్యవధిలో హైదరాబాద్ పోలీసులకు ఫేస్‌బుక్‌ స్నేహితుల వల్ల మోసపోయిన.. మరో ఇద్దరు మైనర్ బాలికలు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్ శాండిల్య సూచించారు.

"మేము‍‌ (పోలీసులు) అందరం సోదరుల వంటి వారిమని అమ్మాయిలందరికీ తెలియజేస్తున్నా. మాకు చెప్పండి. మాకు చెప్పకపోతే ఇందులో మహిళా పోలీసుల ఫోన్‌ నంబర్లు ఉంటాయి. వారికి తెలియజేయండి. నేను తల్లిదండ్రులకు ధైర్యం, భరోసా ఇవ్వడానికి వచ్చాను." - సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌

కరోనా తర్వాత సెల్‌ఫోన్ వినియోగం బాగా పెరిగినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ తరగతుల కోసం తల్లిదండ్రులు చిన్నారులకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారు. పలు విషయాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనవుతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. మోసాల బారిన పడకుండా సోషల్ మీడియాను వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు (Police Precautions) తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

హలో సిస్టర్.. సోషల్​ మీడియాలో రీల్స్ పోస్టు​ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!!

చిన్నారులను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని.. వారి ప్రవర్తనలో మార్పులు వచ్చినప్పుడు సమస్యను అడిగి తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. యువతులు ఒకవేళ మోసగాళ్ల ఉచ్చులో చిక్కితే అధైర్యపడకుండా వెంటనే తమను సంప్రదించాలని కోరుతున్నారు.

ఆన్​లైన్ డేటింగ్ చేస్తున్నారా? రొమాన్స్ స్కామ్​లో చిక్కుకునే ప్రమాదం ఉంది - జాగ్రత్త!

సోషల్ మీడియా వాడుతున్న మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.