హైదరాబాద్ చాంద్రాయణగుట్ట వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. గౌస్ నగర్లో ఓ గర్భిణీ పురుటి నొప్పులతో బాధపడుతోందని.. తమను ఆదుకోవాలని డయల్ 100 ద్వారా వారికి ఫోన్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలింగ్ వాహనంలోనే ఆమెను మలక్పేట ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.
గర్భిణీని సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు పోలీసు అధికారులను మెచ్చుకున్నారు. గర్భిణీ ఆడ శిశువును జన్మనిచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. గర్భిణీ పరిస్థితిని అర్థం చేసుకుని త్వరగా స్పందించిన ఇద్దరు పోలీసులను సీనియర్ పోలీసు అధికారులు మెచ్చుకున్నారు.
ఇదీచదవండి 53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి