ETV Bharat / state

బెజవాడ గ్యాంగ్‌వార్‌ రియల్‌ స్టోరీ - విజయవాడ గ్యాంగ్​వార్​పై పోలీస్ రిపోర్ట్ న్యూస్

సందీప్‌, పండు... ఇద్దరూ ఒకప్పుడు మిత్రులే. వారి మధ్య.... కాలం కత్తులు దూసింది. గూండాయిజం గ్రూపులు కట్టింది. నువ్వెంతంటే నువ్వెంత అని సవాళ్లు విసిరింది. ఇదేదో రీల్‌ స్టోరీ కాదు.. బెజవాడ గ్యాంగ్‌వార్‌ రియల్‌ స్టోరీ. ఇంతకీ ప్రాణ స్నేహితులు ప్రాణాలు తీసుకునే వరకూ ఎందుకెళ్లారు? రెచ్చగొట్టిందెవరు? రెచ్చిపోయిందెవరు? ఆ శనివారం ఏం జరిగింది?

ఇద్దరూ ఒకప్పుడు మిత్రులే.. కాలం కత్తులు దూసింది

author img

By

Published : Jun 3, 2020, 8:36 AM IST

ఏపీ బెజవాడ గ్యాంగ్‌ వార్‌ కేసు కొలిక్కి వస్తోంది. ఘర్షణలో పాల్గొన్న.. 25 మందిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. త్వరలో వీరి అరెస్టు చూపించబోతున్నారు. సందీప్, పండు మధ్య వ్యక్తిగత వైరమే కత్తులు దూసుకునేందుకు దారితీసిందని దర్యాప్తులో తేలింది. ఒకప్పుడు కలిసి తిరిగిన ఇద్దరూ మనస్పర్థలతో వేర్వేరు ముఠాలు కట్టారు. విజయవాడతోపాటు గుంటూరు జిల్లా సెంటిల్‌మెంట్లలోనూ.. తలదూర్చారు. విజయవాడలో ల్యాండ్ సెటిల్‌మెంట్లకు గుంటూరు జిల్లా నుంచి.. గుంటూరు జిల్లాలో తగాదాలకు బెజవాడ యువకులను వెంట తీసుకెళ్తున్నట్లు... పోలీసులు గుర్తించారు. బయటి వ్యక్తుల్ని గుర్తించే వీలుండదని వారు భావించినట్టుగా... అనుమానిస్తున్నారు. వీడియో ఆధారంగా కృష్ణా, గుంటూరు జిల్లాల యువకులు.. గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్నట్టు.. పోలీసులు ఆధారాలు సేకరించారు. మంగళగిరికి చెందిన పలువురున్నట్లు కూడా గుర్తించారు.

ఫోన్​లోనే సవాళ్లు..

గత శనివారం జరిగిన గ్యాంగ్‌వార్‌లో సందీప్ మృతి చెందగా... పండు గాయాలతో చికిత్స పొందుతున్నాడు . తనతోపాటు సెటిల్​మెంట్​లో.. పండు కూర్చోవడం ఇష్టంలేని సందీప్‌.. రాత్రి అనుచరులతో కలిసి ఇంటికెళ్లిమరీ పండుతో గొడవపడ్డాడు . పండు శనివారం ఉదయం... సందీప్‌కు చెందిన స్టీల్ దుకాణం వద్దకు వెళ్లి గొడవ చేశాడు. దుకాణంలోని కుర్రాళ్లను కొట్టి... బ్లేడుతో గాయపరిచాడు. విషయం తెలిసిన సందీప్.. పండుకు ఫోన్ చేశాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఫోన్‌లోనే.. సవాళ్లు విసురుకున్నారు. తేల్చుకుందాం రా అంటూ.. స్పాట్‌ ఎంచుకున్నారు. సందీప్ తన అనుచరులకు ఫోన్ చేసి పటమటలోని అతని దుకాణం వద్దకు పిలిచాడు. అంతా కలిసి దుకాణంలోనే మద్యం తాగారు. పండు కూడా తన అనుచరులందరికీ.. ఫోన్ చేసి పిలిపించాడు. మద్యం, గంజాయి తెప్పించి బాగా కిక్కెక్కించాడు.

సినిమా రేంజ్​లో..

సందీప్‌కు ఫోన్‌ చేసిన పండు యనమలకుదురు సమీపంలోని ఓ స్పాట్‌లో ఉన్నానని చెప్పాడు. సందీప్‌ దాదాపు 25 మందిని వెంటేసుకుని కత్తులు, ఇనుపరాడ్లు పట్టుకుని ద్విచక్ర వాహనాలపై వెళ్లాడు. అక్కడ.... పండు గ్యాంగ్ కనిపించకపోవడం వల్ల ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు. తాము స్పాట్ మార్చామని పటమట తోటవారి వీధిలోని.. ఖాళీ స్థలం వద్దకు రావాలని చెప్పాడు. అదే కోపంలో సందీప్.. పండు చెప్పిన చోటకు... వెళ్లాడు. సందీప్ వర్గం కత్తులు, రాడ్లతో రెచ్చిపోగా.... పండు వర్గం బ్లేడ్లు, బీరు సీసాలతో దాడికి దిగింది. వాస్తవంగా ఈ వీడియోను.. సందీప్ తీయించాడంటూ ప్రచారం జరిగినా... ఓ స్థానికుడు గ్యాంగ్‌ వార్‌ను చిత్రీకరించాడు. అతన్ని ఇరువర్గాలూ బెదిరించాయి. అసలు వీడియో ఎందుకు తీశావ్. చంపేస్తామని బెదిరించడం వల్ల అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

భయపడేలా టిక్ ​టాక్​ వీడియోలు

గ్యాంగ్ వార్‌లో పాల్గొన్న ఇరువర్గాల సోషల్ మీడియా.. ఖాతాలు చూస్తే వీరి మానసిక పరిస్థితి ఏంటనేది... అర్థమవుతోంది. ఓ గ్యాంగ్ కు నాయకుడైన.. పండు తనను తానో రౌడీగా.. అభివర్ణించుకున్నాడు. భయభ్రాంతులకు గురిచేసేలా టిక్‌ టాక్‌లు చేస్తుంటాడు. సందీప్, పండు ఫేస్ బుక్, టిక్‌టాక్ ఖాతాల ఫాలోవర్స్‌ను.. విచారించేందుకూ పోలీసులు సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి: విజయవాడలో.. పాత సంస్కృతి పడగవిప్పుతోందా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.