Polytechnic Exam Paper Leak: పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన నలుగురిని రిమాండ్‌కు తరలించారు. నగర శివారు బాటసింగారంలోని స్వాతి పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 8, 9 తేదీల్లో ప్రశ్నాపత్రాలను లీకేజీ జరిగినట్టు గుర్తించారు. తమ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్మిన్ అధికారి కృష్ణ మూర్తి, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ కృష్ణ మోహన్ కలిసి పథకం వేశారు. ఈ మేరకు వారు పరిశీలకుడు వెంకటరామిరెడ్డిని పరీక్ష సమయానికి కాకుండా ఆలస్యంగా రావాలని కోరారు.
దీంతో అతను వారు చెప్పినట్టు ఆలస్యంగా వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు. ఇతర కళాశాలల విద్యార్థులకు కూడా ప్రశ్నాపత్రాలు చేరినట్టు పోలీసులు చెప్పారు. సాంకేతిక విద్యమండలి అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అసలు నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: Polytechnic Exam Paper leak: అర్ధగంట ముందే పరీక్ష పేపర్ లీక్... నలుగురు అరెస్ట్