ETV Bharat / state

గతంలో 74, నిన్న 50కేసులు.. టీడీపీ నేతలపై పోలీసుల వ్యవహార శైలి

Cases Against TDP leaders in Kuppam: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న కుప్పం పర్యటనలో పోలీసులు పార్టీ నేతలపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాళ్లబుదుగర్ పోలీస్‌స్టేషన్‌లో దాదాపు 50మందికి పైగా కార్యకర్తలపై 3 ఎఫ్‌ఐఆర్​లు నమోదు చేశారు. 307, 353 నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు.. 6 నెలల నుంచి 10ఏళ్ల వరకు శిక్షపడే సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Cases Against TDP leaders in Kuppam
Cases Against TDP leaders in Kuppam
author img

By

Published : Jan 5, 2023, 5:20 PM IST

Cases Against TDP leaders in Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న సమయంలో మరోసారి పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోంది. టీడీపీ నేతలపై పెట్టిన కేసులతో మరోసారి పోలీసుల వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చే విధంగా తయారైంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో నిన్న కుప్పంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి ఘటనపై పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

20 నిమిషాలపాటు కాలినడక: ప్రచార రథాన్ని పోలీసులు అంగీకరించకపోవడంతో చంద్రబాబు పెద్దూరు గ్రామంలో సుమారు 20 నిమిషాలపాటు కాలినడకన తిరిగారు. ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మిగిలిన పల్లెలకూ కారులో వెళ్లారు. షెడ్యూల్‌లోని బెండనకుప్పం, గొల్లపల్లె క్రాస్‌, శివకురుబూరు, తదితర గ్రామాల్లోని వీధుల్లో కాలినడకనే పర్యటించారు. అదే సమయంలో పోలీసులకు చంద్రబాబుకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

పార్టీ నేతలపై హత్యాయత్నంతో పాటుగా వివిధ కేసులు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్నటి కుప్పం పర్యటనలో శాంతి భద్రతలకు భంగం కలిగించారని, పోలీసులు పార్టీ నేతలపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాళ్లబుదుగర్ పోలీస్‌స్టేషన్‌లో దాదాపు 50మందికి పైగా కార్యకర్తలపై 3ఎఫ్‌ఐఆర్​లు నమోదు చేశారు. 307, 353 నాన్ బెయిలబుల్ సెక్షన్లతోపాటు శ్రేణులపై 6 నెలల నుంచి 10ఏళ్ల వరకు శిక్షపడే సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

గతంలో 74 మంది టీడీపీ నేతలపై కేసులు: చంద్రబాబు గతంలో కుప్పం పర్యటనలో సైతం ఇదే నియోజకవర్గంలో 74 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. పది మందిని అరెస్టు చేసి, నెల రోజులు జైల్లో పెట్టారు. అయితే జగన్ పర్యటన చేసిన చోట మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండటంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ మాత్రం రోడ్డుపై వెళ్లొచ్చా అంటూ ప్రశ్నిస్తున్నారు? టీడీపీ నేతలకు ఒక చట్టం, వైసీపీ నేతలకు ఓ చట్టమా? అంటూ చంద్రబాబు నిన్న జరిగిన రోడ్డు షోలో డీజీపీ ప్రశ్నించారు. తన ప్రశ్నలుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన టీడీపీ కార్యకర్తలు, నేతపై కేసులు పెట్టడంతో కుప్పంలో మరోసారి ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.