ద్విచక్ర వాహనంపై వెనకాల కూర్చున్న వారూ తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవటం వల్ల గత పదకొండు నెలల్లో 33 మంది ప్రమాదాల్లో మృతి చెందగా.. 248 మంది గాయాల పాలయ్యారని పోలీసులు తెలిపారు.
గత నెలలోనే రోడ్డు ప్రమాదాల ద్వారా 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వివరించారు. శిరస్త్రాణం ధరించడం వల్ల తమ ప్రాణాలను కాపాడుకోవచ్చునని సూచించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని.. ప్రమాదాలు జరిగినప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు.