ETV Bharat / state

అంబులెన్స్‌.. ఇకపై ఎక్కడా ఆగదు.!

హైదరాబాద్​ ట్రాఫిక్​లో అంబులెన్సులు వెళ్లాలంటే నరకమే. సిగ్నల్స్​ వద్ద ఇరుక్కుపోతే దాటేందుకు నిమిషాలు లెక్కపెట్టాల్సిందే. ఇలాంటి సమస్యకు ఇకపై నుంచి సిటీ పోలీసులు చెక్​ పెట్టనున్నారు. అంబులెన్స్‌లు నేరుగా ఆసుపత్రులకు చేరుకునేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. కూడళ్ల వద్ద గ్రీన్​ లైట్​తో రైట్​ రైట్ చెప్పనున్నారు. దీనికోసం పోలీస్ కాప్​ యాప్​తో అంబులెన్స్​కు అమర్చిన జీపీఎస్​కు అనుసంధానం చేయనున్నారు. మరింత మెరుగ్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వీలైనంత వేగంగా దీన్ని ప్రారంభించనున్నారు.

police officials developed New technology
నగరంలో అంబులెన్సుల కోసం ప్రత్యేక వ్యవస్థ
author img

By

Published : May 26, 2021, 7:05 AM IST

రాజధాని నగరంలో అంబులెన్స్‌లు నేరుగా ఆసుపత్రులకు చేరుకునేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం అంబులెన్స్‌కు అమర్చిన జీపీఎస్‌(గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌)ను, పోలీస్‌ కాప్‌ యాప్‌ను అనుసంధానం చేయనున్నారు. ప్రయోగాత్మకంగా మంగళవారం రెండు 108 వాహనాలకు జీపీఎస్‌లు అమర్చి కూడళ్ల వద్ద గ్రీన్‌సిగ్నల్‌ వస్తుందా? లేదా? అని పోలీస్‌ అధికారులు పరిశీలించారు. మరింత మెరుగ్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వీలైనంత వేగంగా దీన్ని ప్రారంభించనున్నారు.

డీజీపీ నిర్ణయంతో..
హైదరాబాద్‌లో వేల సంఖ్యలో వాహనాల రాకపోకల కారణంగా కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ నిత్యకృత్యంగా మారింది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి సోమాజిగూడకు ఓ అంబులెన్స్‌ రావాలంటే కనీసం ఏడు ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఆగాలి. వీటిని వేగంగా పంపిచేందుకు రెడ్‌ సిగ్నల్‌ను గ్రీన్‌ లైట్‌గా మార్చాలంటే అప్పటికప్పుడు సాధ్యం కాదు. ఇందుకోసం అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. అంబులెన్స్‌ జీపీఎస్‌ను కాప్స్‌ యాప్‌తో కలిపితే ఫలితం ఉంటుందని ఐటీ విభాగం అధికారులు తెలిపారు.

  • హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లోని 108, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన అంబులెన్స్‌ల జీపీఎస్‌లను పోలీసులు సేకరిస్తున్నారు. రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వచ్చే వాటి వివరాలూ తీసుకుంటున్నారు.
  • వీటన్నింటితో యాప్‌ను రూపొందిస్తారు. దాని ద్వారా అంబులెన్స్‌లు ఎక్కడున్నాయన్నది క్షణక్షణం తెలుసుకోవచ్చు. మూడు పోలీస్‌ కమిషనరేట్లలోని కూడళ్ల వద్ద జీపీఎస్‌ వ్యవస్థ యాక్టివేట్‌ అవుతుంది.
  • అంబులెన్స్‌ అర కిలోమీటరు దూరంలో ఉండగానే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడలి వద్ద సిగ్నలింగ్‌ వ్యవస్థ గుర్తిస్తుంది. ఈ సమాచారం సిగ్నల్‌ వద్ద ఉన్న పోలీసులకూ తెలుస్తుంది. 500 మీటర్ల దూరాన ఉన్నప్పుడే అంబులెన్స్‌ వస్తున్న సమాచారం ఉంటుంది కాబట్టి సాంకేతిక వ్యవస్థ దానికి దారిచ్చేస్తుంది. ఈ లోపు తగిన విధంగా ట్రాఫిక్‌ సర్దుబాటు చేసేసి అది ఆగకుండా సాగిపోయేలా పోలీసులూ అప్రమత్తంగా ఉంటారు.

ఇదీ చూడండి: పెద్దదిక్కు ప్రాణాలు హరించి.. కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.