ETV Bharat / state

విధి నిర్వహణలో పోలీసుల పనితీరుకు ప్రశంసాపత్రాలు - హైదరాబాద్ సమాచారం

పోలీసు వృత్తి అంటేనే సవాళ్లతో కూడుకున్నది. ఈ శాఖలో అత్యుత్తమ ప్రతిభ మామూలు విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. వారందరిని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.

Police officers get appriciation from dgp to thier performance in the work
విధి నిర్వహణలో పోలీసుల పనితీరుకు ప్రశంసపత్రాలు
author img

By

Published : Nov 17, 2020, 10:53 PM IST

రాష్ట్ర పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పలు హోదాల్లో అధికారుల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చారు.

హైదరాబాద్​లోని రాష్ట్ర పోలీసుశాఖ ప్రధాన కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమం ద్వారా అన్ని జిల్లా కార్యాలయాల నుంచి పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ చూపిన 209 మంది పోలీస్ అధికారులకు జిల్లాల ఎస్పీల చేతుల మీదుగా వాటిని అందజేశారు.

ఇదీ చూడండి:ఎన్నికల ప్రక్రియలో పోలీసులది కీలకపాత్ర: సీపీ అంజనీకుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.