చంటిబిడ్డను ఇంటి దగ్గర వదల్లేక విధులకు తీసుకొచ్చారు ఓ మహిళా ఎస్సై. అమ్మలా లాలిస్తూనే.. మరోవైపు తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఏపీలోని కడప దిశ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది వరలక్ష్మి. పరిషత్ ఎన్నికల్లో కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో విధులు కేటాయించారు. ఆమెకు ఆరునెలల చంటిపాప ఉంది. ఇంట్లో నుంచి విధులకు వద్దామనుకంటే.. ఇంట్లో బిడ్డ ఏడుపు. తల్లి మనసు వదిలి వెళ్లాలనుకోలేదు. మరోవైపు ఎన్నికల విధులు... చేసేదేం లేక బిడ్డను తీసుకుని విధులకు హాజరయ్యింది.
కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే.. తన బిడ్డ ఆలనా..పాలనా చూసుకుంది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు అటుగా వచ్చిన కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. ఈ దృశ్యాన్ని చూసి ఎస్సైని అభినందించారు. పోలీస్ అయితేనేం.. అమ్మే.. కదా..!
ఇదీ చదవండి: యాదాద్రిలో విష్ణు పుష్కరణి ప్రహారీ గోడ కూల్చివేత