ETV Bharat / state

లక్ష రూపాయలను తిరిగి యజమానికి అందించిన పోలీసులు - ts news

లక్ష రూపాయలు గల హ్యాండ్​బ్యాగ్​ను కోల్పోయిన వ్యక్తి ఫిర్యాదు మేరకు 48గంటల లోపే కేసును ఛేదించారు లంగర్​హౌస్​ పోలీసులు. తిరిగి డబ్బును పోగొట్టుకున్న వ్యక్తి అందించారు.

police hand over to one lakh rupees to owner in hyderabad
లక్ష రూపాయలను తిరిగి యజమానికి అందించిన పోలీసులు
author img

By

Published : Aug 28, 2020, 9:51 PM IST

లక్ష రూపాయల నగదు గల హ్యాండ్​బ్యాగ్​ను లంగర్​హౌస్​ పోలీసులు 48 గంటల లోపే వెతికి పట్టుకున్నారు. అల్కాపూర్ టౌన్​షిప్​లో నివసిస్తున్న ఈశ్వర్ కుమార్ అనే వ్యక్తి గత రెండు రోజుల క్రితం తన ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా లంగర్​హౌస్ సంగం రోడ్ దగ్గర డబ్బు కలిగిన బ్యాగ్ అతనికి తెలియకుండా జారి పడిపోయింది.

ఇంటికి వెళ్లాక బ్యాగు పోయిందని గుర్తించి... లంగర్​హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​లు పరిశీలించారు. లంగర్​హౌస్ బాపూఘాట్ వద్ద మరో వాహనదారుడు బ్యాగు పడిపోవడం రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో బ్యాగ్ తీసుకెళ్లిన వ్యక్తిని పట్టుకుని, తిరిగి డబ్బుని ఈశ్వర్​కు అందించారు.

ఇవీ చూడండి: కీసర లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు నిందితులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.