ETV Bharat / state

జైలుశిక్షల్లేవ్‌.. తొలిసారి చిక్కిన డ్రంకెన్‌ డ్రైవర్లకు ఉపశమనం

Drunk and drive case details : మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసులకు పట్టుబడిన డ్రైవర్లకు ఉపశమనం కలిగించే వార్త ఇది. తొలిసారి చిక్కిన డ్రంకెన్‌ డ్రైవర్లకు జైలు శిక్షలు ఇకపై ఉండవు. జైలు శిక్షలు కాకుండా... కేవలం జరిమానాతో సరిపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కినా ఏళ్ల తరబడి కేసులు కొలిక్కిరాని నేపథ్యంలో పోలీస్‌శాఖ ఈ దిశగా అడుగులు వేసింది.

drunk and drive case details, drunken drivers  fines
తొలిసారి చిక్కిన డ్రంకెన్‌ డ్రైవర్లకు ఉపశమనం
author img

By

Published : Feb 21, 2022, 10:30 AM IST

Drunk and drive case details : మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసులకు పట్టుబడిన డ్రైవర్లకు ఊరటనిచ్చే అంశమిది. తొలిసారి ఇలాంటి కేసుల్లో చిక్కిన వారికి ఉపశమనం కలిగించే చర్యలు ఆరంభమయ్యాయి. జైలుశిక్షలు కాకుండా కేవలం జరిమానాతో సరిపెట్టేలా ప్రణాళిక రూపొందింది. వచ్చే నెల 12న మెగా లోక్‌అదాలత్‌ను పురస్కరించుకొని ఇలాంటి కేసులను కొలిక్కి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కినా ఏళ్ల తరబడి కేసులు కొలిక్కిరాని నేపథ్యంలో పోలీస్‌శాఖ ఈ దిశగా అడుగులు వేసింది. ప్రత్యేక న్యాయస్థానాల్లో కేసులు భారీగా పెండింగ్‌లో ఉన్నందున తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(టీఎల్‌ఎస్‌ఏ)కి ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు అంగీకారం లభించడంతో పరిష్కార ప్రక్రియ మొదలైంది. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో ఇప్పటివరకు తొలిసారి చిక్కినా సరే రూ.10వేల జరిమానాతో పాటు మందుబాబుల రక్తనమూనాల్లో ఉన్న మద్యం నిల్వల మోతాదును బట్టి జైలుశిక్ష విధిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇలాంటివారు సదరు మోతాదు ఎంత ఉన్నా కూడా రూ.2వేల జరిమానాతో బయటపడే వెసులుబాటు లభిస్తోంది.

తెలంగాణలో మోటారు వాహనాల చట్టంలోని నిబంధనను అనుసరించి తొలిసారి డ్రంకెన్‌డ్రైవ్‌లో చిక్కినా రిమాండ్‌కు తరలిస్తున్నారు. 2016 నుంచి గత అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర కేసులు ఇలా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిలో సుమారు లక్ష మంది తొలిసారి చిక్కినవారే. రెండు, అంతకంటే ఎక్కువసార్లు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కిన కేసుల్ని మాత్రం కొనసాగించనున్నారు. అయితే ఇలాంటి కేసుల్లో ఉదారత ప్రదర్శించడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై నమోదైన జరిమానాల మాఫీకి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. 2016 నుంచి రాష్ట్రంలో సుమారు రూ.2300 కోట్ల జరిమానాలు విధించారు. అయితే ఏటా చెల్లింపులు మాత్రం 30-40శాతానికి దాటకపోవడంతో లోక్‌అదాలత్‌ల్లో పరిష్కార ప్రక్రియను చేపట్టారు. జరిమానాల్లో 50శాతం చెల్లిస్తే మొత్తం మాఫీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.