సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆధునికీకరించిన సామాజిక మాధ్యమాల విభాగాన్ని సజ్జనార్ ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ క్రైం, ఆర్థిక నేరాలు, మహిళలు, చిన్న పిల్లలపై నేరాల గురించి అవగాహన కల్పించవచ్చని సీపీ తెలిపారు.
తద్వారా వారిలో చైతన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే సున్నిత అంశాలపై కూడా దృష్టి సారించనున్నట్టు వివరించారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పోలీసులు పనిచేయవచ్చని సజ్జనార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ లైఫ్‌సైన్సెస్ విజన్ 2020 నివేదికను విడుదల చేసిన కేటీఆర్