ప్రతి మహిళ తను తల్లి కాబోతున్నట్లు తెలిసిన నాటి నుంచి బిడ్డకు జన్మిచ్చే వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉంటుంది. తన ప్రాణాల కంటే కడుపులోని పసికందు ప్రాణాలే ముఖ్యం అనే విధంగా వ్యహరిస్తారు. బలమైన పోషక ఆహారం తీసుకుంటూ... సమయం దొరికితే చాలు విశ్రాంతికే కేటాయిస్తారు. కానీ ఒకవైపు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ...మరోవైపు కడుపులోని నలుసును కాపాడుకుంటూ సాగిన సునయన పటేల్ ప్రయాణం అందరికీ స్ఫూర్తి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ అటవీ ప్రాంతంలో కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు సునయన పటేల్. రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్లింది. భుజాలకు పదికిలోలకు పైగా బరువున్న బ్యాగు తగిలించుకొని, చేతిలో ఏకే-47 గన్ పట్టుకొని అడవంతా తిరిగింది. కొండలు ఎక్కింది. లోయల్లోకి దిగింది. ‘
సెలవులు తీసుకోమన్నారు అధికారులు. ‘ఓపిక ఉన్నన్ని రోజులు డ్యూటీలోనే’ ఉంటానందామె. నెలలు గడిచాయి. శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది సునయన. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీసు అధికారులు ఆమెకు అభినందనలు చెబుతున్నారు.