రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు అంబర్‌పేట 6వ నెంబర్ జంక్షన్ వద్ద పోలీసుల ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి కారణాలు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేసి వాటిని సీజ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ.. ఇంట్లోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనసరంగా బయటకు వస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు