ETV Bharat / state

చార్మినార్‌కు బాంబు బెదిరింపు.. అలాంటిదేమీ లేదన్న పోలీసులు - Hyderabad Latest News

Police Checks In Charminar Area: హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాతబస్తీలోని చారిత్రక కట్టడం చార్మినార్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిందని.. అందుకే పోలీసులు తనిఖీలు చేపట్టారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు.

Police checks in Charminar area
Police checks in Charminar area
author img

By

Published : Nov 21, 2022, 6:58 PM IST

Police Checks In Charminar Area: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ చార్మినార్‌ ప్రాంతంలో పోలీసుల సోదాలు చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోమవారం చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దుకాణాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది గమనించిన కొంతమంది భయపడి బాంబు కోసమే తనిఖీలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు చార్మినార్‌కు ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని.. ఇదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. చార్మినార్‌ వద్ద సాధారణ తనిఖీలే చేపట్టామని వెల్లడించారు. ఇదే విషయమై చార్మినార్‌ ఎస్‌ఐ స్పందించారు. పోలీసులకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని చెప్పారు. బాంబు బెదిరింపులు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు.

ఇవీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి ఉచ్చు బిగుస్తోంది: సుధీర్‌రెడ్డి

గెలుపు గుర్రాలు వారే.. గుజరాత్​లో వారసులకే కాంగ్రెస్​, భాజపా టికెట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.