Police Checkings in Telangana Assembly Election 2023 : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు, ప్రత్యేక బృందాలు విస్తృతంగా వాహనాల తనిఖీలు(Vehicles Checkings) నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు కోట్ల కొద్దీ నగదు, బంగారం, వెండి, అక్రమ మద్యం, మత్తుపదార్ధాలు లభిస్తున్నాయి. వాహనాల్లో తరలిస్తున్న నగదు, బంగారానికి సరైన రసీదులు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుంటున్నారు. ఆదాయపు పన్ను(Income Tax) అధికారులకు వాటిని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు పట్టుబడుతున్న నగదు హవాలా సొమ్మా.. ఎవరికి చేరవేస్తున్నారు అనే అంశాల పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Huge Money Seized in Telangana 2023 : ఎన్నికల కోడ్ అమల్లోకి(Telangana Election Code) వచ్చాక అక్రమంగా నగదు, బంగారం, మద్యం, మత్తు పదార్ధాల తరలింపుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు. వాహనాల తనిఖీల్లో ప్రతి రోజు కోట్ల కొద్దీ నగదు, గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. విలువైన బంగారం, వెండి కూడా సోదాల్లో బయటపడుతోంది. వాటిని తరలిస్తున్న వారు సరైన రసీదులు చూపకపోవడంతో నగదు, బంగారం ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిస్తున్నారు.
Telangana Election Checks 2023 : పోలీసులు, ఎన్నికల అధికారులు, ప్రత్యేక బృందాలు కలిసి చేపట్టిన తనిఖీల్లో పట్టుబడినట్టు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం రూ.724 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేసింది. ఇందులో రూ.292 కోట్ల పైగా నగదు, దాదాపు రూ.123 కోట్ల మద్యం, రూ.39 కోట్ల విలువైన గంజాయి, హెరాయిన్, హాష్ ఆయిల్ ఇతర మత్తు పదార్ధాలు(Drugs), రూ.186 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.83 కోట్ల విలువైన వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి తనిఖీల్లో పట్టుబడ్డాయి.
Police Seized Rs14 crores on Monday : అలాగే నేటితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పర్వానికి బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రూ.14 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం(Police Seized Money) చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసింది. అయితే ఎన్నికల ప్రచారానికి సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉంది. ఈనెల 30 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరోవైపు వనపర్తి జిల్లా పెద్దమందాడి మండలం అల్వాలలో పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. రూ.21 లక్షల విలువైన 127 కాటన్ల మద్యం పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
గచ్చిబౌలిలో రూ.5 కోట్ల నగదు పట్టివేత, ఐటీ అధికారులకు అప్పగింత