ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అనుమానంగా సంచరిస్తూ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల రక్షణ కోసమే ఈ సోదాలు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:"పాక్‌లోనే మసూద్"
నిఘా నీడలో భాగ్యనగరం - RPF
దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. రైల్వేస్టేషన్‌ను మొదలుకొని బస్టాండ్లు, జనావాసాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. నగరాన్ని డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నారు.

ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు
నాంపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలోహైదరాబాద్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే నాంపల్లి రైల్వే స్టేషన్లో సోదాలు చేపట్టారు. రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రయాణీకులను, వారి సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అనుమానంగా సంచరిస్తూ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల రక్షణ కోసమే ఈ సోదాలు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:"పాక్‌లోనే మసూద్"
నాంపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు
sample description