కరోనా నివారణ దృష్ట్యా హైదరాబాద్ నగర శివారుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు మూడు రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం వల్ల శివారు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానాలు విధించడమే కాకుండా... వాహనాలను సైతం జప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
విజయవాడ జాతీయ రహదారిపై హయత్నగర్, పెద్ద అంబర్పేట్ తదితర ప్రాంతాలలో వాహనాల తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.