కోటి రూపాయల విలువైన సిగరెట్ల దొంగతనం కేసును హైదరాబాద్ చందానగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 80 లక్షల విలువైన సిగరెట్లు, కారు, ట్రాలీ వాహనం, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతం వాఘలా గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి సంజయ్ పండలిక్ ధుమెల్, నాందేడ్‌కు చెందిన నామ్‌దేవ్ సాంబజీ ముండే, కాశీనాథ్ కాథంలను అరెస్టు చేశారు. గత నెల 25న నాందేడ్‌లో చోరీకి పథకం పన్నారు.
ఈ నెల 2వ తేదీన హైదరాబాద్‌కు చేరుకుని చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గోదాములో ఉంటిన సిగరెట్ల డబ్బాలను దొంగిలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల్లో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారిని కూడా పట్టుకుంటామని డీసీపీ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: గ్యాస్ కంపెనీలో పేలుడు... ఆరుగురు మృతి