నకిలీ రసీదులు తయారుచేసి ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలిస్తున్నలారీలని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. టీఎస్ 30 టీ 6849 నెంబర్ గల లారీ టీఎస్ఎండీసీఎల్ వెబ్ పోర్టల్లో ఇసుక రవాణా కోసం నమోదు అయింది. లారీ యజమాని శంకర్, డ్రైవర్ రమేష్ గత కొన్ని రోజులుగా తప్పుడు రశీదులు సృష్టించి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుకను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఆ లారీపై ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిఘా పెంచిన పోలీసులకు ఈనెల 10న రాత్రి ఘట్కేసర్ రింగ్ రోడ్ నుంచి నగరానికి ఇసుక లారీ వస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో వచ్చిన టీఎస్ 05యూసీ 8369 నెంబర్ గల మరో ఇసుక లారీని కూడా పట్టుకున్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు ఆన్లైన్ వ్యవస్థ ఉందని ఘట్ కేసర్ పోలీసు ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి చెప్పారు.
ఆన్లైన్లో ఇసుక రవాణాకు అనుమతి పొంది నకిలీ రసీదులు తయారుచేసి గత కొన్ని రోజులుగా ఇసుకను నగరానికి రాత్రివేళ తరలిస్తున్నట్లు గుర్తించినట్లు సీఐ తెలిపారు. లారీ యజమానులు శంకర్, మధుకర్, ఇద్దరు డ్రైవర్లు ఇసుక దొంగతనానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ వివరించారు.
ఇదీ చూడండి : జూనియర్ వైద్యులతో మరోసారి చర్చలు జరిపిన మంత్రి ఈటల