హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంగల్రావు నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకే వీటిని నిర్వహిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ తనిఖీలు ఉపయోగపడతాయన్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని... సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : విద్యార్థిని బలితీసుకున్న బెట్టింగ్ భూతం