ETV Bharat / state

'పోలీసులు కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సంతోషం'

police-bosses-practice-shooting-at-the-gachibowli-sports-shooting-range
'పోలీసులు కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సంతోషం'
author img

By

Published : Jul 2, 2020, 4:47 PM IST

Updated : Jul 2, 2020, 7:18 PM IST

16:44 July 02

'పోలీసులు కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సంతోషం'

'పోలీసులు కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సంతోషం'

కరోనా వైరస్ వల్ల ఆరోగ్యవంతుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. 95 శాతం వారిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కపించవని ఆయన తెలిపారు. సాధారణ జబ్బుల్లాగే తెలియకుండానే వచ్చి వెళ్తుందని పేర్కొన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ షూటింగ్ రేంజ్​​లో పోలీసు ఉన్నతాధికారుల షూటింగ్ ప్రాక్టీస్​లో భాగంగా ఆయన పాల్గొన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తే ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడొచ్చని సీపీ అన్నారు.  

పోలీసు శాఖకు చెందిన వాళ్లు కొంతమంది కరోనా బారిన పడినా క్రమంగా కొలుకుంటున్నారని అంజనీ కుమార్ తెలిపారు. పోలీసులు కోలుకుని తిరిగి విధుల్లో చేరి సమాజానికి మంచి సందేశాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్​తోపాటు అదనపు డీజీ షికా గోయల్, చౌహన్, తరుణ్ జోషి, ఇతర ఐపీఎస్ అధికారులు ప్రాక్టీస్​లో పాల్గొన్నారు. కరోనా నుంచి కోలుకున్న షికా గోయల్, చౌహన్, తరుణ్ జోషిలను సీపీ అంజనీ కుమార్ అభినందించారు. బహుమతి ఇచ్చి తిరిగి విధుల్లోకి స్వాగతించారు. ఈ సందర్బంగా అదనవు డీజీ షికా గోయల్​తో కేక్ కట్​చేశారు.

ఇదీ చూడండి : తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్లు... రైతున్నల నుంచి ప్రశంసలు

Last Updated : Jul 2, 2020, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.