చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భద్రత పెంచారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత జైలులోకి అనుమతిస్తున్నారు. దిశ హత్యాచారం కేసులోని నిందితులను... చర్లపల్లి జైలుకు తరలించే సమయంలో... వారిని ఉరితీయాలంటూ ప్రజలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కారాగారం వద్ద విద్యార్థులు, మహిళా సంఘాల ఆందోళన చేస్తున్నారన్న వార్తలను నమ్మవద్దని పోలీసులు తెలిపారు. జైలు ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేసేందుకు అనుమతి లేదని వివరించారు.
ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'