సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం బొంబాయి కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయి, రూ. 2,200 నగదు, మూడు చరవాణులు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అదే కాలనీకి చెందిన రమేష్ యాదవ్, ప్రేమ్‌కుమార్, రాములుగా గుర్తించారు. అధికారులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : అక్కంపల్లి వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీ