ETV Bharat / state

మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం - ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయించే ముఠా అరెస్ట్ - హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

Police Arrested Drugs Gang in Hyderabad : హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్‌ ముఠాను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30 గ్రాముల మాదకద్రవ్యాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు శామీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 272 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఔటర్ రింగ్​రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

Police Arrested Drugs Gang in Hyderabad
Medchal Police Caught rs.80 Lakhs Worth Ganja
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 7:16 PM IST

Police Arrested Drugs Gang in Hyderabad : రాచకొండ పరిధిలో ఇద్దరు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పరిధిలో నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్​​ను నగర యువతకు అమ్ముతున్నారనే సమాచారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో వనస్థలిపురం పోలీసులకు అందింది. పక్కాప్లాన్​తో కర్ణాటక నుంచి హైదరాబాద్​కు ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ యువతకు అమ్ముతున్న ఇద్దరి సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు.

భాగ్యనగరంలోకి న్యూ ఇయర్ డ్రగ్స్ - అడుగడుగునా నిఘాతో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఎల్బీ నగర్ ఎస్​వోటీ పోలీసుల సహాయంతో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఒక్కో గ్రాము రూ.8 నుంచి రూ.10వేల వరకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.

Medchal Police Caught rs.80 Lakhs Worth Ganja : మరోవైపు ఒడిశా నుంచి పుణెకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను మేడ్చల్ ఎస్​వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80 లక్షల విలువ గల 272 కిలోల గంజాయి, రెండు కార్లు, 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకి చెందిన యోగేష్ రాయ్ సింగ్(29), దినకర్ నరలే(26), చరణ్ లాల్ షిండే(31), యోగి రాజ్ సంజయ్ మహోత్కర్(23), చైతన్య తుషార్ తాంటక్(19), రాహుల్ కాంతిలాల్ పటోకే (19)లుగా గుర్తించారు.

అంతరాష్ట్ర గంజాయి​ ముఠా అరెస్టు - రాష్ట్రాన్ని డ్రగ్స్​ రహిత దిశగా చర్యలు

అనంతరం మేడ్చల్ జోన్ డీసీపీ శబరీష్ మీడియా సమావేశం నిర్వహించి, పూర్తి వివరాలు వెల్లడించారు. తమకి వచ్చిన సమాచారంతో రెండు వాహనాలను ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. ఒడిశాలో గంజా కొనడానికి వెళ్లారని తెలిపారు. రూ.5లక్షలు ఇచ్చి గంజాయి కొని వయా హైదరాబాద్ పుణెకు తరలిస్తున్న క్రమంలో గంజాయిను పట్టుకున్నామని డీసీపీ వెల్లడించారు.

రూ.3 కోట్లు విలువ చేసే మత్తుపదార్ధాలు స్వాధీనం - డ్రగ్స్​ దందాపై పోలీసుల ఉక్కుపాదం

Interstate Ganja Gang Arrested in Hyderabad : ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి తరలింపు.. పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా

Rachakonda Police Arrested Running Fake Notes Racket : మరో ఘటనలో రూ.1000లకు రూ.3000 ఇస్తానని నమ్మించి నకిలీ నోట్లు ఇస్తూ మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల నకిలీ కరెన్సీ, ఒక ఎర్టిగా కార్, ఆరు మొబైల్ ఫోన్లు, ఒక పోలీస్ లాఠీనీ స్వాధీనం చేసుకున్నారు.

Prathidwani : రాష్ట్రంలో మళ్లీ హడలు పుట్టిస్తున్న డ్రగ్స్‌ దందా.. చరమగీతం పాడేదెప్పుడు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.