ETV Bharat / state

Police Arrested 3 Drugs Suppliers : ప్రైవేట్​ బస్సులు, లారీల్లో డ్రగ్స్​ సరఫరా.. ముగ్గురు నిందితుల అరెస్ట్ - హైదరాబాద్​ తాజా నేర వార్తలు

Police Arrested 3 Drugs Suppliers in Hyderabad : ప్రైవేట్​ బస్సులు, లారీలు, బొలెరో వాహనాల్లో సరుకుల మాటున మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Police Arrested 3 Drugs Suppliers in Hyderabad
Police Arrested 3 Drugs Suppliers
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 4:51 PM IST

Police Arrested 3 Drugs Suppliers in Hyderabad : రెండు వేర్వేరు కేసుల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరేడ్​మెట్ పోలీస్టేషన్ పరిధిలో రాజస్థాన్ నుంచి హైదరాబాద్​కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న మనోజ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరేడ్‌మెట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు రాజస్థాన్​కు చెందిన మనోజ్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Drugs Seize in Hyderabad : రాయదుర్గంలో డ్రగ్స్ స్వాధీనం.. రాజమండ్రికి చెందిన ముఠా అరెస్ట్​

నిందితులు రాజస్థాన్ నుంచి నగరానికి ప్రైవేట్ బస్సుల్లో, లారీల్లో సజ్జల లోడ్​ మధ్యలో డ్రగ్స్ పెట్టి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.6 లక్షల విలువ చేసే 50 గ్రాముల ఎండీఎంఏ, చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్​లో నివాసం ఉంటూ.. అవసరం ఉన్న వారికి రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి.. గ్రాము రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు పూనం చంద్‌ పరారీలో ఉన్నట్లు వివరించారు.

50 Crore Worth Drugs seized at Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో.. రూ.50 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత

మరో కేసులో ఉప్పల్ పోలీసులతో కలిసి ఎల్బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. సీలేరు నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగోల్​కు చెందిన కుంచల శ్రీను, అనకాపల్లికి చెందిన కల్ల రాములు అనే ఇద్దరిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. గంజాయితో పాటు బొలెరో వాహనం, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పోలీసుల తనిఖీలు ఎక్కువయ్యాయి. కొంతకాలంగా తెలంగాణ పోలీసులు డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్​ ఏర్పాటు తరువాత మాదర ద్రవ్యాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, ఇన్​ఫార్మర్ల సాయంతో నగరంలో ఇప్పటికే చాలాసార్లు దాడులు నిర్వహించి డ్రగ్స్ పట్టుకున్నారు. ఇటీవల టాలీవుడ్​తో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా డ్రగ్స్​తో సంబంధం ఉందన్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

డ్రగ్స్​ స్మగ్లింగ్​పై కేంద్రం ఉక్కుపాదం.. 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.