ETV Bharat / state

'అప్రోచ్‌ ఛానల్‌ 600 మీటర్లతో ప్రారంభించాలి'

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన మంగళవారం 17వ డీడీఆర్‌పీ వర్చువల్‌ సమావేశం నిర్వహించింది.స్పిల్‌ వేకు ఎగువన ఎడమ వైపున 500 మీటర్ల మేర గైడ్‌ వాల్‌ నిర్మాణానికి దాదాపు పచ్చజెండా ఊపింది. గోదావరి నీటిని స్పిల్‌ వే లోకి మళ్లించే అప్రోచ్‌ ఛానల్‌ను ప్రారంభంలో 600 మీటర్ల వరకు ఏర్పాటు చేయాలని పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) సూచించింది.

polavaram-project-authority-on-approach-channel
'అప్రోచ్‌ ఛానల్‌ 600 మీటర్లతో ప్రారంభించాలి'
author img

By

Published : Mar 24, 2021, 8:51 AM IST

గోదావరి నీటిని స్పిల్‌ వే లోకి మళ్లించే అప్రోచ్‌ ఛానల్‌ను ప్రారంభంలో 600 మీటర్ల వరకు ఏర్పాటు చేయాలని పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) సూచించింది. స్పిల్‌ వేకు ఎగువన ఎడమ వైపున 500 మీటర్ల మేర గైడ్‌ వాల్‌ నిర్మాణానికి దాదాపు పచ్చజెండా ఊపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన మంగళవారం 17వ డీడీఆర్‌పీ వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్యానెల్‌ ఛైర్మన్‌ ఏబి పాండ్యా, ఇతర నిపుణులు హండా, మునిలాల్‌, దత్తా, శ్రీవాస్తవలతో పాటు పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, సలహాదారు గిరిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రాతి మట్టి కట్ట నిర్మించాల్సిన చోట ఎగువన గోదావరి గర్భం కోతపై కూడా చర్చించారు. తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్‌ జానకిరామయ్య ఇందుకు సంబంధించి ఒక ప్రజంటేషన్‌ ఇచ్చారు. కోత ప్రాంతంలో పూర్తిగా ఇసుకతో నింపి పూర్తిగా ఒదిగిపోయేలా చేసి అంతా సహజ స్థాయికి సర్దుకున్న తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణం చేపట్టాలని ప్యానెల్‌ సూచించింది.

పుణెలో 2 డి నమూనా ధ్వంసం చేద్దామా?

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆకృతులపై అధ్యయనం చేసేందుకు పుణెలో కేంద్ర విద్యుత్తు జల పరిశోధన స్థానంలో 2డి నమూనా రూపొందించారు. దాన్ని ఇక ధ్వంసం చేస్తామని ఆ సంస్థ వారు ప్రతిపాదించారు. దీనిపై తర్జనభర్జనలు జరిగాయి. చివరికి ఇక దాని అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. క్షేత్ర స్థాయిలో మరికొన్ని పరిశీలనలు జరిపి సమాచారం పంపాలని ప్యానెల్‌ సూచించింది. వాటి ఆధారంగా మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మరో వారం పది రోజుల్లో మరోసారి వర్చువల్‌ విధానంలో లేదా పోలవరం క్షేత్రస్థాయిలో సమావేశం అవుదామని ప్యానెల్‌ నిర్ణయించింది.

ఇదీ చదవండి: 'ఓటర్లకు నగదు బదిలీని సైబర్​ నేరాలుగా దర్యాప్తు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.