ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ప్రొద్దుటూరులో అమానవీయ సంఘటన - ప్రొద్దుటూరు వార్తలు

ఆ కుటుంబంలో ఐదుగురు ఉన్నారు.. వారికున్న కష్టాలకు తోడు... ఆ కుటుంబంలో కరోనా పిడుగు వచ్చి పడింది. అందులో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలింది. వైద్యులు అందరికీ పరీక్షలు చేయాలన్నారు. అయితే తమ కుటుంబంలో ఉన్న ఇద్దరి కవలలు పరిస్థితి సరిగా లేదని...దయచేసి ఇంట్లోనే పరీక్షలు చేస్తే బాగుంటుందని కుటుంబీకులు వేడుకున్నారు. కానీ మాటవినని అధికారులు ఏం చేశారంటే...

కరోనా ఎఫెక్ట్: ప్రొద్దుటూరులో అమానవీయ సంఘటన

author img

By

Published : Jul 1, 2020, 9:39 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో అమానవీయ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్ట‌ణంలోని శ్రీరాంన‌గ‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ నిర్ధ‌ర‌ణ అయ్యింది. దీంతో కుటుంబ స‌భ్యుల‌ు ఐదుగురిని క‌రోనా ప‌రీక్ష‌ల నిమిత్తం ప్ర‌భుత్వాసుపత్రికిి తీసుకెళ్లారు. అందులో ఇద్ద‌రు యువ‌కులు క‌వ‌ల‌లు.. ఒక‌రు న‌డ‌వ‌లేని స్థితిలో ఉండ‌గా మ‌రొక‌రికి మాన‌సిక ప‌రిస్థితి సరిగా ఉండ‌దు. వారు ఆసుప‌త్రికి రాలేర‌ని ఇంట్లోనే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని చెప్పినా వినిపించుకోకుండా ఆసుప‌త్రికి తీసుకెళ్లార‌ని కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆసుప‌త్రిలోని న‌ర్సుల‌ను, వైద్యుల‌ను చూసి భ‌య‌ప‌డిన మాన‌సిక స్థితి స‌రిగా లేని యువ‌కుడు అక్క‌డి నుంచి పారిపోయాడు. ఇవాళ మ‌ళ్లీ స‌చివాల‌య ఉద్యోగులు, ఏఎన్ఎం ఆ యువ‌కున్ని వెతికి తీసుకొచ్చారు. చేతులు తాడుతో క‌ట్టివేసి ఉండ‌టాన్ని చూసిన కుటుంబ స‌భ్యులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఇలాంటి స‌మ‌యంలో వైద్యం అందించాల్సిందిపోయి కరోనా పరీక్ష నిర్వహించి ఇంటికి పంపుతామ‌ని వైద్యులు చెబుతున్నార‌ని... త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు ప్రశ్నించారు. ఇంటికి పంప‌కుండా ఆసుప‌త్రిలోనే ఉంచి యువకుడికి చికిత్స అందించాల‌ని డిమాండ్​ చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్: ప్రొద్దుటూరులో అమానవీయ సంఘటన
ఇవీ చదవండి: ఉరవకొండలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.