పేదల అభివృద్ది కోసం భూసంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకే దక్కుతుందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడమంటే... ఆయనకు ఘన నివాళులర్పించినట్లేనని మండలి ఛైర్మన్ అన్నారు.
పీవీ వర్ధంతి సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గుత్తా సుఖేందర్ పీవీ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పూలమాలతో నివాళులర్పించారు. భారత ఆర్థిక రూపురేఖలు మార్చినటువంటి మహానేత పీవీ అని సభాపతి పోచారం కొనియాడారు. పీవీ లేకపోయినా.. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, జ్ఞాపకాలు మన మధ్యనే ఉంటాయని పోచారం తెలిపారు. దేశానికి దిక్సూచి చూపించిన మహానేతగా పీవీని అభివర్ణించారు.
- ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'