భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘయుష్సు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని మోదీ ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన ప్రధాని మోదీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
"మీ నాయకత్వంలో పనిచేయడం, మీ మార్గదర్శనంలో నడవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మీ నాయకత్వంలో భారత్ అతిత్వరలోనే విశ్వగురువుగా పునర్వైభవం సాధించడమే కాదు ప్రపంచానికంతా ఆదర్శంగా నిలుస్తోంది. ఎల్లప్పుడు మీ ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా."
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్