ETV Bharat / state

'దేశంలో మళ్లీ లాక్​డౌన్ ఉండదు.. సీఎం ప్రశ్నకు ప్రధాని జవాబు' - modi on lock down

దేశంలో మళ్లీ లాక్​డౌన్ విధిస్తారనే వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన విజ్ఞప్తిపై ఆయన ఈ మేరకు స్పందించారు. దేశంలో లాక్​డౌన్​ల దశ ముగిసి... అన్​లాక్​ల దశ ప్రారంభమయిందని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన సందర్భంగా ఈ విషయం తెలియజేశారు.

kcr-modi
సీఎం కేసీఆర్​తో ప్రధాని వీడియో కాన్పరెన్స్​
author img

By

Published : Jun 17, 2020, 8:00 PM IST

Updated : Jun 17, 2020, 8:27 PM IST

'‘దేశంలో మళ్లీ లాక్​డౌన్ విధిస్తారేమో అనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్​డౌన్​పై ప్రకటన చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ప్రధాన మంత్రి ముఖ్యమంత్రులందరితో చర్చించకుండా లాక్​డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరని చెబుతూ వస్తున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి'’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని కోరారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ... 'దేశంలో మళ్లీ లాక్​డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్​డౌన్ ముగిసింది. ప్రస్తుతం అన్​లాక్ 1.0 నడుస్తోంది'. ఇప్పుడు మనమంతా అన్​లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించుకోవాలని ప్రధాన మంత్రి బదులిచ్చారు.

కరోనా నివారణ చర్యలపై ప్రధానికి కేసీఆర్​ వివరణ

‘‘కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని... ప్రస్తుతం వైరస్​ వ్యాప్తి అదుపులోనే ఉందని కేసీఆర్​ తెలిపారు. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదవుతోందని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తోన్న పోరుతో కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 'తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా కృషి చేస్తోన్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం ఉందని' ముఖ్యమంత్రి వివరించారు. మళ్లీ మామూలు జీవితం గడిపే రోజులు వస్తాయని కేసీఆర్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

'వలస కూలీలను అనుమతించండి'

వివిధ రాష్ట్రాల కూలీలు, కార్మికులు, హమాలీలు పనుల కోసం మళ్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని...ఈ సమయంలో వారికి పని చేసుకునే అవకాశం కల్పించాలని కేసీఆర్​ ప్రధానిని కోరారు. దేశమంతా ఒకటే అని, ఎక్కడి వారు ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకునే అవకాశం ఉండాలని విన్నవించారు. బిహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారని కేసీఆర్​ తెలిపారు.

బిహార్​ సీఎంతో కేసీఆర్​ సరదా వ్యాఖ్యలు

బిహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సరదాగా స్పందించారు. 'నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సీఎస్ కూడా మీ బిహార్ వారే. దయచేసి పంపించండి’ అని కేసీఆర్​ చమత్కారంగా అన్నారు.

ఇదీ చూడండి : వీరులారా... మీకు దేశం సెల్యూట్ చేస్తోంది​ : సీఎం కేసీఆర్

Last Updated : Jun 17, 2020, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.