ETV Bharat / state

'పాలసీ విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత' - pm modi isb

PM Modi Hyd Tour: ఐఎస్​బీ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న ప్రధాని.. అనేక స్టార్టప్‌లు కూడా రూపొందించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుందని ఆయన తెలిపారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని.. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించారు.

ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో  మైలురాయి అందుకుంది: ప్రధాని

author img

By

Published : May 26, 2022, 3:29 PM IST

Updated : May 26, 2022, 4:24 PM IST

PM Modi Hyd Tour: ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని.. ఇక్కడి విద్యార్థులు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు.

ఐఎస్​బీ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న ప్రధాని.. అనేక స్టార్టప్‌లు కూడా రూపొందించారని ప్రశంసించారు. 25 ఏళ్ల నాటి సంకల్పంలో చాలా మంది ముఖ్య పాత్ర ఉందన్నారు. జీ 20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని ప్రధాని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. అంతర్జాల వినియోగదారుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. స్టార్టప్‌ల రూపకల్పనలో భారత్‌ మూడో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. వినియోగదారుల మార్కెట్‌లో భారత్‌ మూడో స్థానంలో ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు.

యువకుల పాత్ర ఉంది: "కరోనా విపత్తు వేళ భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. కరోనా కారణంగా గొలుసు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్‌ పురోభివృద్ధి సాధిస్తోంది. గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈ ఘనతలన్నీ ప్రభుత్వం ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. భారత్‌ సాధించిన ఘనతలో ఐఎస్‌బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఉంది. స్టార్టప్‌లు, సేవా రంగంలో యువత సత్తా చాటుతున్నారు. యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. పలు సమస్యలకు పరిష్కార మార్గాలు భారత్‌లో లభిస్తున్నాయి. వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో సమన్వయం చేసుకోవాలి. యువత ఆలోచనలను దేశ పురోభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తుంది." -ప్రధాని మోదీ

రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారని.. పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుందన్నారు. దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుందన్నారు. రాజకీయ కారణాలతో సంస్కరణల అమలు కష్టంగా మారిందన్న ప్రధాని.. 3 దశాబ్దాలుగా రాజకీయ అస్థిరతతో అమలు కష్టమైందని తెలిపారు.

ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుంది: ప్రధాని

ఇవీ చదవండి:

Last Updated : May 26, 2022, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.