కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు హైదరాబాద్ జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ తయారీని పరిశీలించారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కొవాగ్జిన్ పురోగతిని తెలుసుకున్నారు. భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. భారత్ బయోటెక్ పర్యటన అనంతరం ప్రధాని పుణె బయలుదేరి వెాళ్లారు.
కరోనా టీకా అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటన చేపట్టిన ప్రధాని... ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడి జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన 'జైకోవ్-డి' టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.