అసెంబ్లీని ప్లాస్టిక్ రహిత జోన్‌గా ప్రకటించారు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ అధ్యక్షతన జరిగిన వన్యప్రాణి, పర్యావరణ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీని ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తున్నామన్న స్పీకర్... ఇకపై ప్రాంగణం, పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిల్స్, వస్తువులను వాడరాదని స్పష్టం చేశారు. పర్యావరణహితమైన వస్తువులను మాత్రమే వాడామని ప్రకటించారు.
మట్టి కుండలు, గ్లాసులు సిద్ధం
సమావేశంలో మట్టితో తయారు చేసిన కుండలు, గ్లాసులు ప్రవేశపెట్టారు. ఇప్పటి నుంచే ఇందుకు శ్రీకారం చుడుతున్నట్లు సభాపతి పోచారం ప్రకటించారు. రాష్ట్రంలో అడవుల రక్షణ, హరితహారం అమలు, పర్యావరణహిత చర్యలపై సమావేశంలో చర్చించారు.
గ్రీన్ ఛాలెంజ్‌కు ప్రశంసలు
గ్రీన్ ఛాలెంజ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు కమిటీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. హరితహారం నిర్వహణకు గ్రీన్ ఛాలెంజ్ అదనపు ఆకర్షణగా నిలిచిందని... సంతోష్ కృషి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణం