కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. వందల ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో వ్యాధి నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేస్తూ కొందరు వెనకడుగు వేయకుండా పోరాడుతున్నారు. చికిత్సకు.. చేయూతనిచ్చి బాధితులను బతికిస్తున్నారు.
రోజురోజుకీ కరోనా బారిన పడుతున్న వారికంటే కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తున్నారు. అయితే భయం, అపోహలతో ఎక్కువమంది ప్లాస్మా ఇచ్చేందుకు ఇంకా ముందుకు రావడం లేదు. జనంలో చైతన్యం కల్పించేందుకు నగరవ్యాప్తంగా పోలీసులు, ఎన్జీవోలు ప్లాస్మాదానంపై అవగాహన కల్పిస్తున్నారు.
నగరమేయర్ బొంతు రామ్మోహన్, ప్రముఖ దర్శకులు రాజమౌళి ఇప్పటికే కోలుకున్నాక ప్లాస్మా దానంపై సందేశమిచ్చారు. ఇదేక్రమంలో కొందరు తమ అనుభవాల్ని 'ఈనాడుో- ఈటీవీభారత్'తో పంచుకున్నారు ప్లాస్మాదాతలు. తాము గెలిచి.. మరిన్ని ప్రాణాల్ని గెలిపించేందుకు ఒకటి కాదు రెండు మూడుసార్లు ప్లాస్మా దానం చేశామన్నారు.
మూడుసార్లు ఇచ్చా
మే నెలాఖరులో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. గాంధీలో చేరా. అక్కడ 14 రోజుల చికిత్స అనంతరం మరో 15రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నా. తర్వాత ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సందేశమిచ్చారు. దీనిపై అవగాహన లేక ఇంట్లో వాళ్లు వద్దన్నారు. అయినా మరో ప్రాణం కోసం ముందుకొచ్ఛా జులై మొదట్లో ఓ బాధితుడికి ఇచ్ఛా పదిహేను రోజుల తర్వాత మళ్లీ రెండోసారి ఇచ్ఛా రెండు రోజుల క్రితమే మూడోసారి ఇచ్చాను.
-ఉదయ్‌కిరణ్ గుప్తా
ప్రాణం పోసే అదృష్టాన్ని వాడుకుందాం
కోలుకున్న మనం ఇంకొకరికి ప్రాణం పోసే అదృష్టం ప్లాస్మాదానంతో వస్తుంది. నాకు మార్చి నెలాఖరులో పాజిటివ్‌గా నిర్ధారణైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక ఓ రోజు సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపు. వెంటనే ఒప్పుకున్నా. నావల్ల మరో ప్రాణం నిలబడుతుందంటే సంతోషమే. అప్పుడు ఒకసారి, మళ్లీ వారం పరిధిలోనే మరో వ్యక్తికి అత్యవసరం అనడంతో ఇంకోసారి ఇచ్ఛా
- లక్ష్మణ్‌కుమార్ వీరమాచినేని
ఏ సమస్యా లేదు..
నేనూ ఇప్పటికే రెండుసార్లు ప్లాస్మా దానం చేశా. పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. నాకు జూన్ నెలాఖరులో పాజిటివ్‌గా తేలింది. ఇంటికే పరిమితమై చికిత్స తీసుకున్నా. మంచి ఆహారం, వైద్యుల సూచనలు పాటించి పది రోజుల్లో పూర్తిగా కోలుకున్నా. వెంటనే ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్ఛా ఓ స్నేహితుడికి అత్యవసరమైతే నా దాకా తీసుకొచ్చారు. ఆసుపత్రికి వెళ్లి ప్లాస్మా ఇచ్చొచ్ఛా మా నాన్నకి తీవ్రంగా ఉందని ఓ అమ్మాయి అడగ్గా రెండోసారి ఇచ్ఛా.
- అప్పల్రాజు
అపోహలొద్దు... ప్రాణం పోద్దాం..
ప్లాస్మా దానంపై వస్తున్న అపోహలు వీడండి. మన శరీరంలో కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుని మన రక్తం మనకి తిరిగి ఎక్కిస్తారు. కొద్దిరోజుల్లోనే మళ్లీ ప్లాస్మా తయారవుతుంది. పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్ఛు నేనూ ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను. డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహారం తీసుకుంటే యాంటీ బాడీస్ తయారవుతూనే ఉంటాయి. మంచి ఆహారంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్ఛు అదే ఇప్పుడు కరోనాని ఎదుర్కొనే మందు.