ETV Bharat / state

'కుటుంబంలో ఏ వేడుక జరిగినా మొక్కలు నాటాలి'

రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్​తోపాటు అన్ని జిల్లాల్లో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు జరిపింది. హైదరాబాద్​లోని కేబీఆర్ పార్కులో వాకర్స్, సందర్శకుల కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి అటవీ శాఖ ఉన్నతాధికారులు మొక్కలు నాటారు.

plants-should-be-planted-for-any-family-celebration
'కుటుంబంలో ఏ వేడుక జరిగినా మొక్కలు నాటాలి'
author img

By

Published : Mar 21, 2021, 4:42 PM IST

childrens planting the plant
మొక్క నాటుతున్న చిన్నారులు

ప్రపంచ అటవీ దినోత్సవాన్ని రాష్ట్ర అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్​తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అటవీ శాఖ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో వాకర్స్, సందర్శకుల కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, అటవీ శాఖ ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. నివాస యోగ్యమైన పరిసరాల కల్పన, రానున్న తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పీసీసీఎఫ్ శోభ వివరించారు. చిన్నపిల్లల్లో అడవులు, పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం వల్ల సామాజిక స్పృహ పెరుగుతుందని ఆమె వెల్లడించారు.

Forest staff participating in an awareness rally
అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఫారెస్టు సిబ్బంది

కుటుంబంలో ఏ వేడుక జరిగినా, ఆ సందర్భంగా పిల్లలతో ఒక మొక్క నాటించి, వాటిని పెంచే సంస్కృతిని అలవాటు చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్​లో జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్ట్ కాలేజ్, పరిశోధనా సంస్థ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఒక ఎకరం స్థలంలో గంధపు మొక్కలు నాటారు.

Awareness program on forests
అడవుల పట్ల అవగాహన కార్యక్రమం

ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో పాములపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సొసైటీ సభ్యులు బర్డ్ వాచింగ్, రాష్ట్రంలో కనిపించే అరుదైన పక్షుల గురించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అడవులు, పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల రక్షణకు అవసరమైన అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలతో అటవీ సిబ్బంది సమావేశమై.. అగ్ని ప్రమాదాల నివారణ, అటవీ భూముల రక్షణకు అవసరమైన చర్యలపై అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి : ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తెరాస గెలిచింది: కోదండరామ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.