ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హైదరాబాద్‌లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు, సభ్యులతో సమావేశమయ్యారు. బాలల హక్కుల పరిరక్షణకు గట్టి చర్యలు చేపట్టాలని కమిషన్‌కు సూచించారు. బాలలను సమాజంలో ఉత్తములుగా తీర్చిదిద్దాలని, అందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న విషయాన్ని మరువొద్దని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పారు. భవిష్యత్తు బాలలదేనని, వారి అభ్యున్నతికి కృషి చేస్తేనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వినోద్ అభిప్రాయపడ్డారు. బాల కార్మికులు లేకుండా చూడాలని, బాలలందరూ చదువుకునేలా చూడాలన్నారు.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ