ETV Bharat / state

కుటుంబపాలన అంటున్న మోదీకి.. వారంతా కనిపించడం లేదా: వినోద్​కుమార్ - వినోద్​ కుమార్​ కామెంట్స్

Vinod Kumar comments on PM Modi : ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్​ పర్యటించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. వాటిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ ఖండించారు. రాష్ట్రానికి వచ్చి ఇచ్చింది ఏమీ లేదని అన్నారు. కుటుంబ పాలన అనే ముందు పలువురు బీజేపీ నాయకుల కుమారులు ఏం చేస్తున్నారో చూడాలన్నారు.

Vice President of Planning Commission Vinod Kumar
ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు వినోద్‌కుమార్‌
author img

By

Published : Apr 8, 2023, 5:59 PM IST

ప్రధాన మంత్రి మోదీని ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్​కుమార్ ప్రశ్నించారు​

Vinod Kumar comments on PM Modi : కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం సహకరించ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని అనేక మార్లు విన్నవించినా ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సార్లు కేంద్రం దృష్టి తీసుకెళ్లామని.. అయినా ఇంత వరకు ఇచ్చింది ఏమీ లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ రైల్వే లైన్‌ పనులు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆ బీజేపీ నాయకుల కుమారులు ఏం చేస్తున్నారు: కుటుంబ పాలన అని మోదీ చాలా మాట్లాడారని.. కానీ బీజేపీలో ఉన్న అమిత్‌షా కుమారుడు ఎక్కడ ఉన్నారు.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడు ఏమిటి, అనురాగ్ ఠాకూర్‌ తండ్రి ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావు ఉద్యమం చేశారన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని.. దీని గురించి ఒక మంచి మాట అయినా చెప్పారా అని నిలదీశారు. జన్‌ధన్‌ ఖాతాలో రూ.15 లక్షల జమ చేస్తామని చెప్పారు.. ఇంత వరకు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు.

అప్పుడెందుకు రావొద్దన్నారు: ఎన్నికల సమయంలోనైనా ప్రధాని రాష్ట్రానికి ఏమైనా వరాలు ఇస్తారని భావించామని.. కానీ ఏమీ ఇవ్వలేదన్నారు. మోదీ రాష్ట్రానికి వచ్చారు.. వెళ్లారు అంతే తప్ప ఇచ్చింది ఏమీ లేదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఆసరా నేరుగా లబ్దిదారుల ఖాతాలోనే జమ అవుతున్నాయని.. అలాంటి సమయంలో అవినీతి ఎక్కడ జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. 2020లో మోదీ హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు రావొద్దు అని చెప్పారో ఇంత వరకు సమాధానం లేదని.. రావొద్దు అంటే ఎవరైనా వస్తారా అని అన్నారు.

"ప్రధానమంత్రి హైదరాబాద్​ పర్యటనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్​కు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే.. ఎందుకు జాతీయ హోదా కల్పించలేదు. ఐదు సంవత్సరాలుగా 14 జాతీయ రహదారులు పెండింగ్​లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మీద అనవసరమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 33 మెడికల్​ కాలేజీ​లు పెట్టేందుకు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు ఆరోపణలు ఎలా చేస్తారు." - వినోద్‌కుమార్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.