మహారాష్ట్రలోని పలు నగరాల్లో మెట్రో రైలు నిర్మాణ భాద్యత వహిస్తున్న మహ మెట్రో సంస్థ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఇక్కడ చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం మెట్రో వ్యవస్థకి భిన్నంగా, తక్కువ ఖర్చుతో మెట్రో నియో పేరుతో నాసిక్‌లో ఏర్పాటు కాబోతున్న ప్రాజెక్టు గురించి కేటీఆర్‌కు తెలియజేశారు.
ఉన్న రోడ్ల పైన కూడా మెట్రో
నూతన పద్ధతిలో ప్రాజెక్టు వ్యయం తగ్గడం వల్ల స్వల్ప కాలంలోనే నిర్మాణం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. సాంప్రదాయ మెట్రోలో రైల్వే కోచ్‌లు ఉపయోగిస్తుండగా.. ఇక్కడి మెట్రోలో ఎలక్ట్రిక్ బస్సు కోచ్‌లను ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఎలివేట్ కారిడార్లతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్ల పై కూడా ఈ మెట్రో నడుస్తుందన్నారు. ఇందులో 350 నుంచి 400 మంది ప్రయాణికులు ఒకే సారి ప్రయాణించే వీలు కలుగుతుందన్నారు. మహా మెట్రో అధికారులు అందించిన ప్రజంటేషన్పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో
నాసిక్ మాదిరిగా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో మెట్రోనియో ప్రతిపాదనలు అనువుగా ఉంటాయని కేటీఆర్ అన్నారు. ఎలివేటేడ్ బీఆర్టీఎస్ రూపకల్పనలో మహా మెట్రో సంస్థ అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. మెట్రో స్టేషన్లపై సోలార్ విద్యుత్ ఉత్పాదన, వంటి అంశాలను ఈ ప్రతిపాదనల్లో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ హైదరాబాద్‌లోని జనాలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లోనూ ఏలివేటెట్, ఎలక్ర్టిక్ బీఆర్ టీఎస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాసిక్‌లో మెట్రో నియో మాడల్‌ను అధ్యయనం చేయాలని మెట్రో రైల్ సంస్థను ఆదేశించారు. సమగ్ర ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు.
ఇదీ చూడండి : తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో సుప్రీంకు పోలీసులు