హైదరాబాద్ రాజేంద్రనర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ ఏడాది జూన్, జులై నాటికి వ్యవసాయ బయో డైవర్సిటీ పార్క్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని... వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు తెలిపారు. ఆ బాధ్యతలను రిజిస్ట్రార్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
భవిష్యత్తులో వ్యవసాయం జీవవైవిధ్యం ఆధారంగా ఉండబోతుందని వీసీ తెలిపారు. ఈ వర్షాకాలం నుంచి వర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థి విధిగా ఒక మొక్క నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బయో డైవర్సిటీ హెరిటేజ్ వాక్ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, పాలక మండలి సభ్యులు, ఇతర శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పాల్గొని మొక్కలు నాటారు.
ఇదీ చదవండి: 'న్యాయవాద దంపతుల హత్యలో తెరాస నేతల ప్రమేయం'