తెలంగాణ ఆవిర్భావం తర్వాత మూడు వ్యవసాయ కళాశాలలు ప్రారంభమయ్యాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి వెల్చా ప్రవీణ్‌రావు అన్నారు. వచ్చే ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో మరో కళాశాల ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, పీవీ నర్సింహారావు పశు విశ్వవిద్యాలయం, శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బైపీసీ స్ట్రీమ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కౌన్సెలింగ్‌ను వీసీ ప్రారంభించారు. కౌన్సెలింగ్‌లో మొదటి సీటును మనీష అనే విద్యార్థినికి కేటాయిస్తూ... ఉపకులపతి ధ్రువపత్రం అందజేశారు. ప్రతి రోజు కౌన్సెలింగ్ పూర్తైన తర్వాత మిగిలిన సీట్ల వివరాలు పీజేటీఎస్‌ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ప్రపంచ జనాభా అంతా తొలి జీవితాన్ని వ్యవసాయ రంగంలోనే ప్రారంభించినప్పటికీ... కాలక్రమేణా అనేక వృత్తులు వచ్చాయని తెలిపారు.
ఇవీ చూడండి: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా నామినేషన్